రేణు దేశాయ్ కర్నూలు జిల్లా పర్యటన వెనుక ఉంది ఆ పార్టీయేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, February 27, 2019

రేణు దేశాయ్ కర్నూలు జిల్లా పర్యటన వెనుక ఉంది ఆ పార్టీయేనా?

ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండు రోజులు ఆయన కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల వంటి ప్రాంతాల్లో పర్యటించారు. అయితే పవన్ కల్యాణ్ పర్యటించిన రోజునే పవన్ కల్యాణ్ మాజీ సతీమణి, సినీ నటి రేణు దేశాయ్ కూడా కర్నూలులో పర్యటించడం కలకలం రేపింది.

పవన్ కల్యాణ్ ఆదోనిలో పర్యటించిననప్పుడు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చానంటూ రేణు దేశాయ్ అక్కడికి సమీపంలోనే ఒక ప్రాంతానికి వెళ్లారు. రేణు దేశాయ్ తోపాటు సాక్షి టీవీ న్యూస్ రీడర్ స్వప్న కూడా ఉండటంతో దీని వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా సాక్షి టీవీ మైకు పట్టుకుని రేణు కనిపించడంతో పక్కాగా నిర్ధారణకు వచ్చేశారు. పవన్ రాయలసీమ పర్యటన నుంచి ప్రజలు, మీడియా దృష్టికి మళ్లించడానికి వైఎస్సార్సీపీ రేణు దేశాయ్ ని ప్రవేశపెట్టిందనే విమర్శలు రేగాయి. దీనికి ఊతమిస్తూ పవన్ రాయలసీమ పర్యటనకు సిద్ధమయ్యే ముందు రోజే వైఎస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది.

మెగాభిమానులు ఎక్కువగా ఉన్న రాయలసీమలో వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుకు పవన్ కల్యాణ్ చిల్లు పెడతారనే భయంతోనే సాక్షి పత్రికలో కథనాలు రాయించడం, వ్యూహాత్మకంగా రేణు దేశాయ్ కు సాక్షి టీవీ మైక్ ఇచ్చి యాంకర్ గా కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగిపోయాయని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కు మైలేజీ రాకుండా చేయడానికే వీటితోపాటు పవన్ సభలోకి వైఎస్సార్సీపీ అనుకూల రైతును ప్రవేశపెట్టి జగన్ ను గెలిపించాలని నినాదాలు ఇప్పించారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇలాంటి తప్పుడు పనులు ఎన్ని చేసినా పవన్ కల్యాణ్ హవాను రాయలసీమలో ఆపలేరని సవాల్ చేస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad