మహానాయకుడు అట్టర్ ప్లాప్ కావడానికి కారణాలు ఇవేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, February 27, 2019

మహానాయకుడు అట్టర్ ప్లాప్ కావడానికి కారణాలు ఇవేనా?

దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు దారుణంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఒకదాన్ని మించి మరొకటి అట్టర్ ప్లాప్ లుగా నిలవడంతో నందమూరి బాలకృష్ణ క్యాంప్ లో నిర్వేదం అలుముకుంది. గొప్ప దర్శకుల్లో ఒకరైన క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్, షాలిని పాండే, దగ్గుబాటి రాణా, సుమంత్, విద్యాబాలన్, ప్రగ్యాజైశ్వాల్, కల్యాణ్ రామ్ వంటి భారీ తారాగణంతో నందమూరి అందగాడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ చిత్రాల పరాజయం వెనుక అనేక కారణాలు ప్రధానంగా నిలుస్తున్నాయి. అవి ఏమిటంటే..

వాస్తవాలకు దూరంగా చిత్రీకరణ: కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాల్లోనూ వాస్తవాలకు విరుద్ధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని సినీ విమర్శకులు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, స్వయంగా చంద్రబాబును తన భుజానా మోస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక (సినిమా పేజీ) పేర్కొన్నాయి. ఎన్టీఆర్ ను కారణ జన్ముడిలా చూపడం, దైవాంశసంభూతుడిలా చిత్రీకరించడం, ఎన్టీఆర్ జీవితంలో ఎత్తుపల్లాలను చూపకుండా ఆయన వివిధ సినిమాల్లో పోషించిన పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం కథానాయకుడిని పరాజయం పాలు చేశాయి. ఇక రెండో భాగం మహానాయకుడిలో ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓడిపోవడం, 1994లో అఖండ మెజారిటీతో మరోసారి గెలవడం, చంద్రబాబు.. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి ముఖ్యమంత్రి కావడం, ఎన్టీఆర్ పై చెప్పులేయించడం, ఆయన మరణించడం వంటివి లేకుండా కేవలం ఎన్టీఆర్ మొదటి సతీమణి బసవతారకం చనిపోవడం వరకే మహానాయకుడిని ముగించారు. దీంతో సినిమాపై అందరికీ ఆసక్తిపోయింది.

మెగాభిమానులు దూరంగా ఉండటం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సహాయంతో గత ఎన్నికల్లో గెలిచి తర్వాత పవన్ కల్యాణ్ పైనే తీవ్ర విమర్శలు చేసిన టీడీపీపైన, ప్రతిసారీ మెగా ప్యామిలీపైన, ముఖ్యంగా చిరంజీవిపైన దారుణ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న బాలకృష్ణకు బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయంగా మెగాభిమానులు, కాపు సామాజికవర్గం భావించారు. దీంతో వారంతా ఈ సినిమాను బాయ్ కాట్ చేశారు.

వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు దూరంగా ఉండటం: ఎన్నికల ముందు విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ తమ విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశం ఉందని గ్రహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రెడ్డి సామాజికవర్గం ఈ సినిమాను దూరంగా పెట్టారు. దీంతో రెండు ప్రధాన సామాజికవర్గాల ఆదరణ ఎన్టీఆర్ సినిమాలకు లేకుండా పోయింది. సినిమాలు కూడా డాక్యుమెంటరీలను తలపించడంతో మొదటి రోజు నుంచే నెగెటివ్ గా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ బయోపిక్కులు రెండూ దారుణంగా పరాజయం పాలయ్యాయి.


No comments:

Post a Comment

Post Bottom Ad