పవన్ కల్యాణ్ ఆశలన్నీ హంగ్ అసెంబ్లీపైనేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, February 27, 2019

పవన్ కల్యాణ్ ఆశలన్నీ హంగ్ అసెంబ్లీపైనేనా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న రాయలసీమపై తన దృష్టిసారించారు. వాస్తవానికి రాయలసీమలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మెగాభిమానులు ఉన్నారు. కాపు/బలిజ సామాజికవర్గం జనాభా కూడా ఎక్కువే. వివిధ సామాజికవర్గాల్లోనూ పవన్ కు పెద్ద ఎత్తున అభిమానగణం ఉంది. ఇది తాజా పవన్ కర్నూలు జిల్లా పర్యటనలోనూ స్పష్టమైంది. ఆళ్లగడ్డ, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోనిల్లో పవన్ కార్యక్రమాలకు జనం పోటెత్తారు. ఆయనపై పూల కుర్షం కురిపించారు. కొన్ని చోట్ల జనతాకిడిని నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో పవన్ అర్థాంతరంగా కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

రాయలసీమ పర్యటనలో పలు చోట్ల పవన్ కల్యాణ్ సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం గురించి మాట్లాడారు. జనసేన పార్టీ లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడవవన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తమను సంప్రదించక తప్పదన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో హంగ్ అసెంబ్లీ వస్తుందని పవన్ కల్యాణ్ పెద్ద ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి తగ్గ విధంగానే ఆయన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. కర్ణాటకలో కుమార స్వామిలా తాను కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో పవన్ కల్యాణ్ కీలకం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 88 సీట్లు అవసరం. మొత్తం 175 సీట్లలో 88 సీట్లు వచ్చినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. జనసేన అత్యంత బలంగా ఉన్న ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం), తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపైన పవన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లో 68 సీట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 30 సీట్లను సాధించాలనేది పవన్ లక్ష్యం. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హంగ్ అసెంబ్లీ వస్తుందని పవన్ భావిస్తున్నారు. కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ గా నైనా ఉండాలనుకుంటున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad