అన్నిటా కేసీఆర్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు విజయవంతమయ్యేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, February 27, 2019

అన్నిటా కేసీఆర్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు విజయవంతమయ్యేనా?

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్యుక్తులవుతున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను యథాతథంగా ఫాలో అవుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఇంకా ఎనిమిది నెలల గడువు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమి భయంతో అంత ధైర్యం చేయలేని చంద్రబాబు కేసీఆర్ కు విజయం సాధించిపెట్టిన సంక్షేమ పథకాలపైనే తన దృష్టిని సారించారు. అంతేకాకుండా కేసీఆర్ మాదిరిగానే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

అయితే.. కేసీఆర్ లా చంద్రబాబు విజయవంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. కారణం.. కేసీఆర్ 2014లో తన ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచే వివిధ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారు. అవి క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ అందబట్టే టీఆర్ఎస్ కు ప్రజలు ఘనవిజయం సాధించిపెట్టారు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు ముందునుంచి, ఇంకా రెండు నెలలు కూడా వ్యవధిలేని ప్రస్తుత సమయంలోనూ వివిధ పథకాలను ప్రకటించడం, ఆయా వర్గాలకు ఆదుకునే చర్యలను ప్రకటిస్తున్నారు. చేతిలో అధికారం ఉన్న నాలుగు సంవత్సరాల ఆరు నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల మంత్రాలు ప్రకటిస్తుండటాన్ని ప్రజలు తెలుసుకోలేరని ఆయన అనుకుంటున్నారు.

చంద్రబాబు ఎన్నికల తాయిలాల పట్ల ప్రజల్లో ఎలాంటి సానుకూలత వ్యక్తం కావడం లేదు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఆయన పూర్తిగా నెరవేర్చలేదని అంటున్నారు. ఎన్నికలముందు తాము గుర్తొచ్చామంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్న పథకాలనే సరిగా అమలు చేయకుండా కొత్త పథకాలు ప్రకటించడం పట్ల ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలను, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలను కాపీ కొడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత కాపీ మాస్టర్ గానే మిగిలిపోతారని ప్రత్యర్థి పార్టీలు అవహేళన చేస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad