ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ భయపడుతుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, February 28, 2019

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ భయపడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానం కూడా ఉంది. గతంలో ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత, కమ్మ సామాజికవర్గానికి చెందిన చిగురుపాటి వరప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. మరోసారి ఓడిపోయారు. ఈసారి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ రాయపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పోటీపడ్డారు. ఈ మేరకు భారీ స్థాయిలో పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ తరఫున వీరిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

అయితే.. కృష్ణా-గుంటూరు జిల్లాల పరిధిలోనే రాజధాని అమరావతి విస్తరించి ఉండటం, రాజధానిలో ఇప్పటివరకు ఒక్క శాశ్వత నిర్మాణం లేకపోవడం, రైతుల భూములను రాజధాని పేరిట అక్రమంగా లాక్కోవడం వంటి కారణాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి తప్పదని తెలుగుదేశం పార్టీ గ్రహించింది. ఓటమి ఎదురైతే ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసి లాభపడతాయని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు పోటీ చేయాలనుకుంటున్న రాయపాటి శ్రీనివాస్ కు, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ కు పోటీ చేయొద్దని సమాచారమిచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణ తదితర ఏర్పాట్లతో పార్టీ చాలా బిజీగా ఉందని ఈ సమయంలో పట్టభద్రుల స్థానంపై దృష్టిసారించలేమని చెబుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం ఓటమి ఎదురయితే ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై ఉంటుందన్న భయమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీకి వెనకడుగు వేశారని చెబుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad