కేంద్రం ఇచ్చిన నిధులు నాకేశావా? బాబు అబద్ధాలను కడిగేసిన కేసీఆర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 30, 2018

కేంద్రం ఇచ్చిన నిధులు నాకేశావా? బాబు అబద్ధాలను కడిగేసిన కేసీఆర్!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మొసలికన్నీరు కారుస్తున్న చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అబద్ధాల కోరు అంటూ ఆయన అబద్ధాలను, డబ్బా ప్రచారాలను కడిగి పారేశాడు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మిస్తున్నారని.. దేశంలోనే ఇదే మొదటిది అని పేపర్ల నిండా ప్రకటనలు ఇచ్చుకున్నారని, అయితే రాఫ్ట్‌ ఫౌండేషన్‌ టెక్నాలజీ కొత్తదేం కాదని హైదరాబాద్‌లో వెయ్యికిపైగా ఇళ్లు ఇలాగే కట్టారని తెలిపారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు, మిషన్‌ భగీరథ కింద 18 వేల ట్యాంకులు, హుస్సేన్‌సాగర్‌ చుట్టు ఉన్న అన్ని భవనాలను ఇలాగే కట్టారని చెప్పారు. రేగడి నేలలో ఏ నిర్మాణమైనా ఈ విధానంలోనే నిర్మిస్తారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు తాము అనుకూలమని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌ను వదులుకుంటున్నందుకు ఏపీకి పదేళ్లపాటు లోటు బడ్జెట్‌ ఉంటుందని ఆ మేరకు రూ.24 వేల కోట్లను కేంద్రం ఆ రాష్ట్రానికి ఇవ్వాలని  కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. మళ్లీ లోటు బడ్జెట్‌ ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అంతా అవినీతిమయం అయిందన్నారు. చంద్రబాబుకు ప్రజాసంక్షేమం తెలియదన్నారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చిందని, హైకోర్టు నిర్మాణం కోసం రూ.500 కోట్ల వేరుగా ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు. ఇవన్నీ ఏం చేశావు. నాకేశావా? అంటూ విమర్శించారు. ఇన్ని అబద్దాలా? ఇంత మోసమా? అంటూ విస్తుపోయారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad