ఏపీలో ఏడు నోటిఫికేషన్లు, 1,386 పోస్టులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, January 03, 2019

ఏపీలో ఏడు నోటిఫికేషన్లు, 1,386 పోస్టులు!


ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1, గ్రూప్‌–2 కేటగిరీ పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,386 పోస్టుల భర్తీకి గ్రూప్స్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌–1లో 169, గ్రూప్‌–2లో 446, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 308, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు 405, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు 43, అసిస్టెంట్‌ ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్లు 10, డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్లు 5 పోస్టులున్నాయి.
గ్రూప్‌–2లో 446 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 154, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 292 ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించనున్నారు. గ్రూప్ -2 పోస్టులకు దరస్తు చేసుకోవడానికి చివరితేదీ జనవరి 31. మే 5న స్ర్కీనింగ్ టెస్టు, జూలై 18, 19న మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad