టీఆర్‌ఎస్‌లోకి 8 మంది జంప్ జిలానీలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 17, 2018

టీఆర్‌ఎస్‌లోకి 8 మంది జంప్ జిలానీలు!


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రిపదవుల్లో ఎవరికి బెర్త్ లభిస్తుందనేదానిపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచి పటిష్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇతర పార్టీల్లోంచి అధికార పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జంప్ జిలానీలు ఇప్పటికే రాయబారాలు మొదలు పెట్టారని సమాచారం. కనీసం 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణలోనూ అధికార పార్టీ సాగతీత ధోరణితో ఉండడం కూడా జంప్ జిలానీల కోసమేనా అనే అనుమానాలను కలిగిస్తోంది. పదవులకు ఆశపడిన వారు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉంటుండటం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇతర పార్టీల్లోంచి టీఆర్ఎస్లో చేరిన వారికి మంత్రిపదవులు లభించాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad