వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ ఫిబ్రవరిలో విడుదల! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 15, 2018

వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ ఫిబ్రవరిలో విడుదల!


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర.  దీనిలో వైఎస్సార్‌ పాత్రలో లెజెండరీ నటుడు మమ్ముట్టీ నటిస్తున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు, సుహాసిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

తొలుత సినిమాను డిసెంబర్లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆలస్యమైంది. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డిలు ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.

చాలా కాలం తరువాత మమ్ముట్టి తెలుగు సినిమాలో నటిస్తుండటం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కావడంతో సినిమాపై అంచనాలుపెరిగాయి. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad