కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనలో మరికొంత జాప్యం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 10, 2018

కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనలో మరికొంత జాప్యం!


తెలంగాణలో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితా వెల్లడించేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. శనివారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే సందిగ్ధత ఉన్న కొన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కొందరు కీలక నేతలు మేనిఫేస్టో రూపకల్పనలో భాగంగా దుబాయి పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారు తిరిగి వచ్చే వరకు ప్రకటనకు ఆలస్యం జరుగుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించి నామినేషన్ల ప్రారంభమయ్యే 12వ తేదీనే మొత్తం అభ్యర్థుల పేర్లు ప్రకటించే ఆలోచనలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment

Post Bottom Ad