ఎన్నికల్లో పోటీ చేయనున్న క్రికెటర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 13, 2018

ఎన్నికల్లో పోటీ చేయనున్న క్రికెటర్‌

Masraf-Murtaza-Wants-To Participate-In-Bangladesh-Elections

 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆదేశ క్రికెటర్‌ మష్రాఫ్‌ మోర్తజా సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్‌లోని అధికార పార్టీ అవామీలీగ్‌ తరపున మోర్తాజా బరిలో దిగనున్నట్లు ఆపార్టీ సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌ 30న జరిగే ఈ ఎన్నికల్లో నరైల్‌ ప్రాంతం నుంచి పోటీ చేయనున్నట్లు అవామీ లీగ్‌ పార్టీ ప్రతినిధి హనీఫ్‌ తెలిపారు. ప్రస్తుతం మోర్తాజా బంగ్లాదేశ్‌ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  2019 ప్రపంచ కప్‌  తరువాత కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని, అందుకే రాజకీయ జీవితంపై దృష్టి సారించినట్లు సమాచారం. 2009లో టెస్టు మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పిన మోర్తజా అనంతరం టీ20లకు టాటా చెప్పేశాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad