హర్మన్‌ప్రీత్‌పై నెటిజన్ల ప్రశంసల జల్లు.. ఎందుకంటే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 13, 2018

హర్మన్‌ప్రీత్‌పై నెటిజన్ల ప్రశంసల జల్లు.. ఎందుకంటే

Harmanpreet-Kaur-Video-Viral-on-Social-Media

ఫీల్డ్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునే భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ ప్రీత్ కౌర్‌ మరోసారి అందరి మనసు దోచుకున్నారు. వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా మహిళా సభ్యులు జాతీయ గీతం ఆలాపిస్తున్నారు. ఆ సమయంలో కౌర్ ముందు నిలబడిన ఓ బాలిక అస్వస్థతకు గురైంది. ఆ విషయాన్ని గుర్తించిన కౌర్ జాతీయ గీతం పాడటం పూర్తికాగానే బాలికను ఎత్తుకెళ్లి అక్కడున్న నిర్వాహకులకు అప్పగించింది. ఈ విషయం కాస్తా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అదికాస్తా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది.

No comments:

Post a Comment

Post Bottom Ad