పాక్‌పై భారత్‌ విజయం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

పాక్‌పై భారత్‌ విజయం

ICC-Shock-To-Pakistan
క్రికెట్‌ మైదానంలోనే కాదు న్యాయస్థానంలోనూ భారత్‌ చేతిలో పాకిస్థాన్‌కు పరాజయం తప్పలేదు! తమతో సిరీస్‌లు ఆడతానని చెప్పి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ‘మాట తప్పినందుకు’ రూ.447 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చేసిన వాదనను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తిరస్కరించింది. పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చుతున్నామని, భారత్‌ ఎలాంటి నష్టపరిహారమూ చెల్లించాల్సిన అవసరం లేదని ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్‌సీ) తీర్పు చెప్పింది. దీనికి పీసీబీ కట్టుబడి
ఉండాలని, అప్పీల్‌కు వెళ్లరాదని ఆదేశించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad