తమ్ముడు ఈసారి మీరే గెలవాలి: మోహన్‌బాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 12, 2018

తమ్ముడు ఈసారి మీరే గెలవాలి: మోహన్‌బాబు

Actor-Mohan-Babu-Wants-To-KCR-As-Cm-Again

విలక్షణ నటుడు మోహన్‌బాబు తన మనసులో మాట బయటపెట్టారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారో చెప్పేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. స్వామి స్వరూపనందేంద్ర స్వామి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఫిలింనగర్‌ దైవ సన్నిధానం ఆలయ అర్చకులకు వస్త్రాలను వితరణగా ఇచ్చారు. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆప్యాయంగా తమ్ముడూ అంటూ పలకరిస్తూ ఈసారి కూడా మీరే గెలవాలి అంటూ ఆకాంక్షించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad