ఇంటర్నెట్‌లో 2.ఓ హెచ్‌డీ ప్రింట్‌.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 30, 2018

ఇంటర్నెట్‌లో 2.ఓ హెచ్‌డీ ప్రింట్‌..

2.O-HD-Print-In-Internet-By-Tamilrockers
సినీ పరిశ్రమపై పైరసీ భూతం మరోసారి పంజా విసిరింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో ఎస్‌ శంకర్‌ దర్శకత్వంలో  తెరకెక్కిన 2.ఓ చిత్రం తొలిరోజే ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మూవీ మేకర్లను షాకింగ్‌కు గురిచేస్తూ సినిమా పూర్తి హెచ్‌డీ ప్రింట్‌ను పైరసీ వెబ్‌సైట్‌ తమిళ్‌రాకర్స్‌ లీక్‌ చేసింది. దీంతో నిర్మాతలు, రజనీ అభిమానులను కలవరపరిచింది. పైరసీని నియంత్రించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా సినిమా లీక్‌ కావడం దుమారం రేపుతోంది. గతంలో ఇదే వెబ్‌సైట్‌ గతంలో ధనుష్‌ నటించిన వడచెన్నై, విజయ్‌ హీరోగా తెరకెక్కిన సర్కార్‌ మూవీలను లీక్‌ చేసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad