అమృతపై ఫేస్ బుక్లో పోస్టు చేసిన యువకుడి అరెస్ట్‌! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

అమృతపై ఫేస్ బుక్లో పోస్టు చేసిన యువకుడి అరెస్ట్‌!


నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రేమ వివాహం చేసుకుని, భర్తను కోల్పోయిన అమృత ఉదంతం అందరికీ తెలిసిందే. కూతురు భర్తనే దారుణంగా హత్య చేయించిన అమృతరావును తొలుత అందరూ నిందిస్తూ సోషల్ మీడియా వేదికపై ప్రేమ జంటకు బాసటగా నిలిచారు. కానీ తర్వాత పరిణామాలు కొన్ని అమృతకు వ్యతిరేకంగా మారుతూ వచ్చాయి. పలు ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడిన తీరు, ప్రణయ్ విగ్రహం ఏర్పాటు అంశాల్లో ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరైతే తొమ్మిదో తరగతి నుంచే ప్రేమ ఏంటంటూ ఘాటుగానే స్పందించారు. సోషల్ మీడియాల్లో సైతం పోస్టు చేస్తున్నారు. ఇలా అమృతను కించపరిచేలా అసభ్య కామెంట్లు చేసిన ఈశ్వర్‌(25) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్లో అమృతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు ఈశ్వర్‌పై కేసు నమోదు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad