నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని చంపిన తండ్రీకొడుకులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని చంపిన తండ్రీకొడుకులు!


ఇటీవల హైదరాబాద్లోని అత్తాపూర్‌లో రద్దీగా ఉన్న నడిరోడ్డుపై పట్టపగలు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన మరవకముందే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో తొట్ల రాజు (38) అనే ఓ వ్యక్తిని ఆదివారం తండ్రీకొడుకులు కలిసి నడిరోడ్డుపైనే కిరాతకంగా నరికి చంపేశారు. తన కుమారుడు కృష్ణ చావుకు తొట్ల రాజు కారణమనే అనుమానంతో కృష్ణ తండ్రి కావలి శంకరయ్య, సోదరుడు మచ్చేందర్‌లు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ రాజుపై కృష్ణ బంధువులు గతంలో దాడిచేసినప్పుడే రాజు కుటుంబం సొంత గ్రామం నాగారం వదిలి షాద్ నగర్కు వెళ్లి కూలీ పని చేసుకుని బతుకుతున్నాడు. అయితే ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకునేందుకు ఆదివారం గ్రామానికి వచ్చారు. అదను చూసుకుని గొడ్డళ్లతో రాజుపై మెరుపుదాడి చేశారు. గ్రామం నడిబొడ్డున అందరు చూస్తుండగానే ఈ హత్య జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad