టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూత


విశాఖపట్నం మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని అలస్కాలో కారు ప్రమాదంలో మరణించారు. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన ఆయన గీతం పూర్వ విద్యార్థులతో సమావేశం కోసం అమెరికా వెళ్లారు. అలస్కాలోని ఒక పార్కుని చూడటం కోసం నలుగురితో కలసి కారులో బయలుదేరిన ఆయన కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనతోపాటు మిగిలినవారు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మూర్తి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత గీతం విద్యా సంస్థలను స్థాపించారు. విశాఖపట్నం నుంచి 1991, 1999లో ఎంపీగా గెలుపొందారు. 2004లో ఓటమిపాలయ్యారు. మూర్తి మనవడు భరత్ కే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినిని ఇచ్చి వివాహం చేశారు. మూర్తి మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వెలిబుచ్చారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad