అప్పుడు నేను చిన్నపిల్లాడిని: ప్రముఖ నటుడు శక్తికపూర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

అప్పుడు నేను చిన్నపిల్లాడిని: ప్రముఖ నటుడు శక్తికపూర్


బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా, ప్రముఖ నటుడు నానాపటేకర్ ల వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ హీరోయిన్లు తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. కొంతమంది మాత్రం తమకేం సంబంధం అంటూ తప్పించుకుంటున్నారు. తాజాగా ఇదే కోవలో చేరాడు ప్రముఖ నటుడు శక్తికపూర్ (బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి). తనుశ్రీ దత్తా వ్యవహారంపై మీ స్పందనేంటి? అని మీడియా అడగ్గా.. "ఈ సంఘటన జరిగి దాదాపు పదేళ్లైయింది కదా.. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని. నేను వినాయక ఉత్సవాల కోసం విదేశాలు వెళ్లాను. ఏం జరిగిందో నాకు తెలియదు'' అంటూ చమత్కరించారు. దీంతో ఇంతటి సీరియస్ వ్యవహారంపై వెటకారంగా మాట్లాడిన శక్తికపూర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad