Video Of Day

Breaking News

తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు, 11న కౌంటింగ్


తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. డిసెంబర్ 11న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించింది. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయని స్పష్టీకరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. తెలంగాణలో డిసెంబర్‌ 7న ఒకే విడతలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20 లక్షలు, మిగతా మూడు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 

No comments