ట్విట్టర్ కు దూరమవుతున్న సోనమ్ కపూర్.. ఎందుకంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

ట్విట్టర్ కు దూరమవుతున్న సోనమ్ కపూర్.. ఎందుకంటే..


బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ ఎవరని అడిగితే ఎవరైనా సోనమ్ కపూర్ పేరే చెబుతారు. ఆ రేంజులో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ డ్రస్సులను ధరిస్తూ హాట్ హాట్ సోయగాలతో గుబులు రేపుతోంది.. ఈ భామ. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనమ్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాను పెళ్లాడింది. ప్రస్తుతం అతడితో విదేశాల్లో చక్కర్లు కొడుతూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్న ఈ భామ ఇటీవల 'వీర్ ది వెడ్డింగ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో తన అభిమానులకు అందుబాటులో ఉండే సోనమ్ తన అభిప్రాయాలను నిర్భయంగా చాటుతుంటుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఖాతాను ఇక నుంచి ఆపేస్తున్నానని బాంబుపేల్చింది.. ఈ ముద్దుగుమ్మ. ట్విట్టర్ లో చాలా ఎక్కువ నెగెటివిటీ ఉందని అందుకే తాను ట్విట్టర్ నుంచి వైదొలగుతున్నట్టు పేర్కొంది. అందరికీ శాంతి, ప్రేమ లభించాలని కోరుకుంటున్నట్టు ఈ భామ ట్వీట్ లో పేర్కొంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad