నోటా మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

నోటా మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే..


విజయ్ దేవరకొండ హీరోగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం.. నోటా. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించింది. విజయ్ దేవరకొండకున్న క్రేజు, సినిమాకు చేసిన విపరీతమైన పబ్లిసిటీ మంచి కలెక్షన్లు సాధించడానికి కలిసివచ్చాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఏపీలో రూ.4.55 కోట్ల షేర్, రూ.6.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా అమెరికాలో రూ.75 లక్షల షేర్, రూ.1.85 కోట్ల గ్రాస్ సాధించింది. నోటా చిత్రం తమిళనాడులో మొదటి రోజు మంచి కలెక్షన్ సాధించింది. తమిళనాడులో రూ.కోటి షేర్, రూ.2.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.60 లక్షల షేర్, రూ.1.55 కోట్ల గ్రాస్ సాధించింది. రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో 45 లక్షల షేర్, రూ.1.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.7.35 కోట్ల షేర్, రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad