శివ విడుదలై నేటికి 29 ఏళ్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

శివ విడుదలై నేటికి 29 ఏళ్లు


టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రాల్లో 'శివ'ను కూడా చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, అమల హీరోహీరోయిన్లుగా 1989, అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. రామ్ గోపాల్ వర్మ టేకింగ్, సాంకేతిక విలువలు, నాగార్జున ఇంటెన్సిటీ లుక్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. పాటలు కూడా చిత్ర విజయంలో తమదైన పాత్ర పోషించాయి. నాగార్జున కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అదేవిదంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మను జాతీయ స్థాయిలో టాప్ దర్శకుడిగా నిలబెట్టింది. ఈ చిత్రం విడుదలై నేటికి 29 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad