రాయల్ లుక్ లో అదరగొట్టిన మెగా ప్రిన్స్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

రాయల్ లుక్ లో అదరగొట్టిన మెగా ప్రిన్స్


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. గతేడాది 'ఫిదా', ఈ ఏడాది 'తొలిప్రేమ' చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన ఈ మెగా హీరో ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో ఒకటి.. "అంతరిక్షం'. 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అంతరిక్షం'లో వరుణ్ స్పేస్ సైంటిస్ట్ గా నటిస్తున్నాడు. ఇందులో అందాల భామలు లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా రావిపూడి అనిల్ దర్శకత్వంలో 'ఎఫ్2 (పన్ అండ్ ప్రస్టేషన్)' లో విక్టరీ వెంకటేశ్ తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో మిల్కీభామ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, కారులో కూర్చున్న వరుణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మెగాభిమానులు తెగ లైకులు చేస్తూ షేర్ చేస్తున్నారు. ఈ లుక్ లో నిజంగా మెగా ప్రిన్స్ లానే ఉన్నాడు.. ఈ స్టార్.

No comments:

Post a Comment

Post Bottom Ad