గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే రైతుబంధు సాయం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 10, 2018

గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే రైతుబంధు సాయం!


తెలంగాణలో రెండో విడత పంట పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లోకే చేరనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో చెక్కుల పంపిణీకి ఎలక్షన్ కమిషన్‌ అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో నేరుగా రైతుల అకౌంట్లలోకే డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. అయితే గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే యాసంగిలో రైతుబంధు పథకం అమలు చేయాలని, కొత్త వారిని మినహాయించాలని ఈసీ సూచించింది. నేటి(బుధవారం) నుంచి 25వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటికి వెళ్లి బ్యాంకు ఖాతా నంబర్లు, ఇతర వివరాలు సేకరించనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad