నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఈ నియోజకవర్గాల నుంచే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఈ నియోజకవర్గాల నుంచే!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తలపోస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రిపదవిని దక్కించుకున్నాడని ప్రత్యర్థి పార్టీలు దునుమాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోతే మరిన్ని విమర్శలు మూటకట్టుకోవడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో సురక్షితమైన స్థానం కోసం ఇప్పటినుంచే అన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, అనంతపురం జిల్లాలోని హిందూపురం, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad