కేసీఆర్ చెప్పినట్లుగానే ఎలా జరుగుతుంది? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

కేసీఆర్ చెప్పినట్లుగానే ఎలా జరుగుతుంది?


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరతీసిన ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేస్తున్నారనే దానిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంలోనూ ఆయన చెప్పినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నడుచుకుంటోందనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. సీఎం చేసిన ప్రకటనలే నిదర్శనమవుతున్నాయి. శాసన సభ రద్దు అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందని చెప్పారు. దానికనుగుణంగానే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని సీఎం చెప్పినట్లుగానే.. డిసెంబర్‌ 7న ఎన్నికలను ఈసీ ప్రకటించింది. ఎన్నికల తేదీల విషయంలో సీఎం ముందే జోస్యం చెప్పేస్తుండటంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రభుత్వంపై దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ నిర్వహిస్తున్న హైకోర్టు ధర్మాసనం కూడా వ్యాఖ్యానించడం విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad