తెలంగాణలో బతుకమ్మ పండుగ షురూ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

తెలంగాణలో బతుకమ్మ పండుగ షురూ!


తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేటి(మంగళవారం)నుంచి ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున తొలిరోజు (ఎంగిలిపూల) బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 17న సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగియనున్నాయి. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజా, రవీంద్రభారతి, బైసన్‌పోలో, పరేడ్‌గ్రౌండ్స్, తెలంగాణ కళాభారతి మైదానాల్లో 9 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సద్దుల బతుకమ్మ రోజున 21 దేశాలకు చెందిన మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad