హృతిక్ రోషన్ మీద మరోసారి నిప్పులు చెరిగిన కంగన - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

హృతిక్ రోషన్ మీద మరోసారి నిప్పులు చెరిగిన కంగన


బాలీవుడ్ గ్రీక్ గాడ్.. హృతిక్ రోషన్ పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. బాలీవుడ్ లో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న కాస్టింగ్ కౌచ్ పై కంగన రనౌత్ మాట్లాడుతూ మహిళలు అంటే గౌరవం లేనివారితోనూ, మహిళలను కించపరిచేవారితోనూ హీరోయిన్లు ఎవరూ నటించొద్దంటూ పిలుపునిచ్చింది. మీరు ఎవరి గురించి ఈ పిలుపునిస్తున్నారని మీడియా ప్రశ్నించగా 'ఇంకెవరు.. హృతిక్ రోషన్' అని కంగన సమాధానమిచ్చింది. కాగా, 'కైట్స్' సినిమా షూటింగ్ సందర్భంగా కంగన, హృతిక్ చాలాకాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ వివిధ కారణాలతో విడిపోయారు. హృతిక్ తనను వేధించాడని కంగనా బహిరంగంగా ఆరోపించగా, అంతేస్థాయిలో హృతిక్ కూడా కంగనానే తనకు అసభ్యమైన ఈమెయిల్స్ పంపి తనను వేధించిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad