ఆ డైరెక్టర్ మర్మాంగం పట్టుకోమన్నాడు: బాలీవుడ్ నటి సలోని చోప్రా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

ఆ డైరెక్టర్ మర్మాంగం పట్టుకోమన్నాడు: బాలీవుడ్ నటి సలోని చోప్రా


బాలీవుడ్ లో లైంగిక వేదింపుల ఆరోపణలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఇప్పటికే నటుడు నానాపటేకర్, దర్శకుడు సుభాష్ ఘాయ్, నటుడు అలోక్ నాథ్ పై ఆరోపణలు రాగా తాజాగా ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ పై ప్రముఖ నటి, ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సలోని చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. 2011లో తాను ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేశానని, ఈ క్రమంలో ఆయన తనను పలుమార్లు వేధించాడని వెల్లడించింది. తన మర్మాంగం పట్టుకోవాలని కోరేవాడని, బికినీ వేసుకుని కనిపించమనేవాడని, పని లేకపోయినా అర్ధరాత్రి పూట రమ్మని ఆదేశించేవాడంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. కాగా, ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ అయిన ఫరా ఖాన్ కు స్వయానా సోదరుడైన సాజిద్ ఖాన్ బాలీవుడ్ లో 'డర్నా జరూర్ హై, 'హౌస్ పుల్', హౌస్ పుల్ 2, హిమ్మత్ వాలా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad