యూజర్ల డేటా చోరీతో గూగుల్ ప్లస్ మూత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

యూజర్ల డేటా చోరీతో గూగుల్ ప్లస్ మూతఇటీవల దాదాపు 5 కోట్ల మంది వినియోగదారుల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాకింగ్ కు గురికాగా తాజాగా ఈ జాబితాలో ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ ప్లస్ చేరింది. వివిధ సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు ఐదు లక్షల మంది గూగుల్ ప్లస్ వినియోగదారుల డేటా తస్కరించబడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లస్ ను మూసివేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ ఒక ప్రకటన చేశారు. ఫేస్ బుక్ ఖాతాలు హ్యాకింగ్ గురవడానికి ఒక బగ్ కారణమైనట్టు, గూగుల్ ప్లస్ వినియోగదారుల డేటా చోరీకి గురవడానికి కూడా ఒక బగ్ కారణమైనట్టు కనుగొన్నారు. ఆ బగ్ కు విరుగుడు కనుగొన్నా అప్పటికే ఐదు లక్షల మంది వినియోగదారుల సమాచారం హ్యాకర్లకు చేరింది. దీంతో గూగుల్ ప్లస్ మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad