పవన్ కల్యాణ్ కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

పవన్ కల్యాణ్ కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఏమైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. పవన్ కు ఎలాంటి హాని జరిగినా దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తనకు ప్రాణ హాని ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పినా రక్షణ కల్పించడం లేదని, చంద్రబాబు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కు చిన్న హాని జరిగినా రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ కు పటిష్ట సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని, మావోయిస్టులు అరకు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కాల్చిచంపారని గుర్తు చేశారు. కాగా, కరువు ప్రాంత సమస్యలపై ఉద్యమించేందుకు సీపీఐ, సీపీఎం అక్టోబర్ 3న సమావేశమవుతున్నట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad