తప్పకుండా రాజకీయాల్లో ప్రవేశిస్తా: అమలాపాల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

తప్పకుండా రాజకీయాల్లో ప్రవేశిస్తా: అమలాపాల్


ఒకవైపు ప్రియాంకా చోప్రాను, మరోవైపు దీపికా పదుకుణేను తలపిస్తూ కవ్వించే భామ.. అమలాపాల్. ఈ కేరళ కుట్టి ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. కానీ పట్టుమని రెండేళ్లు కూడా కాకముందే విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయనని మాటిచ్చి మాటతప్పడమే విడాకులకు దారితీసిందని గతంలో వార్తలు వచ్చాయి. కాగా, ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించింది. త్వరలో రాజకీయాల్లో ప్రవేశిస్తానని సంచలన విషయం బయటపెట్టింది. తరచూ తాను మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్తుంటానని, హిమాలయాల సౌందర్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు, ఒక బాలీవుడ్ సినిమా ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad