న్యాయం జరిగే వరకు తనుశ్రీకి అండగా ఉంటానన్న అనుష్క! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

న్యాయం జరిగే వరకు తనుశ్రీకి అండగా ఉంటానన్న అనుష్క!

anushka-sharma-varun-dhawan-commented-tanushree-dutta-nanapatekar-controversy

2008లో ఓ సినిమా షూటింగ్‌లో తనతో నానా పటేకర్‌ అసభ్యంగా వ్యవహరించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో తనుశ్రీ దత్తాకు బాలీవుడ్‌ నటులు అనుష్క శర్మ, వరుణ్‌ ధావన్‌లు అండగా నిలిచారు. సుయిధాగా సినిమా మీడియా మీట్‌ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు అనుష్క మాట్లాడుతూ తనుశ్రీ వ్యాఖ్యలపై కామెంట్‌ చేయడం, ఆమె వ్యక్తిత్వంపై భాష్యాలు చెప్పడం కంటే ఆమె చెబుతున్నది వినాలని, అర్ధం చేసుకోవాలన్నారు. ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ ఇలా మాట్లాడుతుందంటే ఆమె ఆరోపణల్లో నిజమే ఉంటుందన్నారు. తనుశ్రీకి న్యాయం జరిగే వరకూ తాను ఆమె వెంట ఉంటానని అన్నారు. ఇక వరుణ్‌ ధావన్‌ సైతం తనుశ్రీ దత్తాకు మద్దతుగా మాట్లాడారు. తన సినిమా సెట్‌లో ఇలాంటివి జరిగితే తాను బాధితుల పక్షాన ముందుకొచ్చేవాడినన్నారు. తనుశ్రీ లేవనెత్తిన విషయాలపై విచారణలో వాస్తవాలు నిగ్గుతేలతాయన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad