డెనిస్‌ ముక్వేజ్‌, నదియా మురాద్‌లకు నోబెల్ శాంతి బహుమతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

డెనిస్‌ ముక్వేజ్‌, నదియా మురాద్‌లకు నోబెల్ శాంతి బహుమతి

Denis Mukwege, Nadia Murad awarded 2018 Nobel Peace Prize

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించారు. లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన కృషికి, లైంగిక దాడి బాధితులకు చేసిన సహాయానికి గాను డెనిస్‌ ముక్వేజ్‌, నదియా మురాద్‌లకు ఈ బహుమతి లభించింది. డెనిస్‌ ముక్వేజ్ ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్‌‌. ఆయన లైంగిక వేధింపుల బాధితులకు అండగా ఉంటూ వారికి వైద్యసహాయం అందించారు. ఇరాన్‌లోని యాజిదీ (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియా మానవ హక్కుల కోసం పోరాడారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల కారణంగా తనపై జరిగిన లైంగిక హింసను, ఇతర యాజిది యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేశారు. యాజిది యువతులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు పాటుపడ్డారు.

No comments:

Post a Comment

Post Bottom Ad