మహేశ్ బాబు ట్విట్టర్ ఫాలోవర్లు 7 మిలియన్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

మహేశ్ బాబు ట్విట్టర్ ఫాలోవర్లు 7 మిలియన్లు


ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్ లో రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రిన్స్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. అంటే.. అక్షరాలా 70 లక్షల మంది ప్రిన్స్ ను అనుసరిస్తున్నారు. తన తాజా చిత్రాల విశేషాలు, తన పిల్లల ఫొటోలు, హాలిడే ట్రిప్ ల చిత్రాలు ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్టు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.. మహేశ్. అంతేకాకుండా తనకు నచ్చిన వివిధ చిత్రాల గురించి ట్విట్టర్ లో కామెంట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ సూపర్ స్టార్ ను ట్విట్టర్ లో భారీ సంఖ్యలో అభిమానులు అనుసరిస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో ట్విట్టర్ ఫాలోవర్స్ అత్యధికంగా ఉన్న హీరోగా మహేశ్ రికార్డు సృష్టించాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad