జేఎఫ్ డబ్ల్యూ కవర్ పేజ్ పై అదరగొట్టిన ఐశ్వర్య - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

జేఎఫ్ డబ్ల్యూ కవర్ పేజ్ పై అదరగొట్టిన ఐశ్వర్య


ఐశ్వర్యా రాజేశ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో దాదాపు 54 చిత్రాల్లో హీరోగా, సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాజేశ్ కుమార్తె.. ఐశ్యర్య. ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి స్వయానా ఐశ్వర్యకు మేనత్త. స్వతహాగా తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య చెన్నైలో పుట్టడం, తండ్రి రాజేశ్ చిన్న వయసులోనే చనిపోవడంతో చెన్నైలో సెటిల్ అయిపోయింది. మొదట సన్ టీవీలో యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించి తమిళంలో అగ్ర హీరోలతో నటించే స్థాయికి చేరుకుంది.. ఈ ముద్దుగుమ్మ. అయితే తెలుగమ్మాయి అయి ఉండి ఇప్పటివరకు తెలుగులో ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. తాజాగా 'జస్ట్ ఫర్ ఉమెన్' మ్యాగజైన్ కోసం ఐశ్వర్య ఇచ్చిన పోజులు కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్నాయి. అంతగా తన హాట్ లుక్స్ తో ఈ భామ కట్టిపడేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad