నోటా మూవీ రిలీజ్‌ ఆపేయాలని చూస్తున్నారు: విజయ్ దేవరకొండ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

నోటా మూవీ రిలీజ్‌ ఆపేయాలని చూస్తున్నారు: విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda-Nota-movie

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా ఈ నెల 5న విడుదల అవుతుందనే విషయం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సామ్.సి.సుందర్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో పబ్లిక్ మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఆదివారం ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది. రెస్పాన్స్ మాములుగా లేదు. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది.  ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో  సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాంటి ఎలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad