ఇక మీదట నేను బాలీవుడ్‌లో నటించను! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

ఇక మీదట నేను బాలీవుడ్‌లో నటించను!

Tanushree-Dutta-blasts-Amitabh-Bachchan-for-comment-on-Nana-Patekar-sexual-harassment

వారం రోజుల క్రితం అమెరికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చిన తనుశ్రీ దత్తా దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టించారు. ఓ దశాబ్దం కింద 2008లో హార్న్ ఓకే ప్లీజ్ షూటింగ్‌ సమయంలో నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే తనుశ్రీ - నానా వివాదం గురించి ఓ ప్రశ్నకు అమితాబ్‌ ‘నేను తనుశ్రీని కాదు.. నానా పటేకర్‌ని కాదు.. మరి నేను ఎలా స్పందించాలి’ అంటూ చెప్పిన సమాధానంపై తనుశ్రీ తీవ్రంగా మండిపడుతున్నారు. బిగ్‌ బీ లాంటి సూపర్‌ స్టార్‌ ఇలా మాట్లాడటం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ విషయం గురించి తను సోషల్‌ మీడియాలో మాట్లాడనని, టీవీ చానెల్స్ లో కూడా మాట్లాడనన్నారు. జనాల నుంచి కూడా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కదాని బాధ కాదని, ఇండస్ట్రీలో చాలా మందిదని చెప్పారు. వారంతా ఇలా ధైర్యంగా ముందుకు రాలేకపోయారని, తాను ముందుకు వచ్చి తన ధర్మాన్ని పూర్తిగా నిర్వహిస్తానని అన్నారు. ఇక మీదట నేను బాలీవుడ్‌లో నటించనంటూ అమెరికా వెళ్లి పోతానని చెప్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad