నటి శ్రీరెడ్డి మరోసారి వార్తలకెక్కారు. ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీపై వరుస విమర్శులు చేసే శ్రీరెడ్డి ఈసారి కోలివుడ్‌లో రచ్చ చేస్తోంది. మంగళవారం తన ఫేస్‌బుక్‌లో దక్షిణ భారత నటీనటుల సంఘంలోని ఒక సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనని వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. ఆమె ఫేస్‌బుక్‌లో ఏమన్నారంటే ‘మంగళవారం ఒక టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను. అసలు రూపాన్ని మరచి నంగనాసి కబుర్లు బాగానే చెబుతున్నారు. నీ అసలు రంగు బయటపెట్టే ఆధారాలు నాదగ్గర ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుంచి సహాయ నటీమణుల వరకూ ఎలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నారో ఆధారాలు ఉన్నాయి. దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ, నిర్మాత మండలిలోనూ పదవుల్లో ఉన్నానని ఎగిరి పడుతున్నావు. మిస్టర్ నీ నకిలీ ముఖాన్ని త్వరలోనే బయట పెడతా’ అంటూ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment