ధోని గురించి గంగూలీ ఏమన్నాడు..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

ధోని గురించి గంగూలీ ఏమన్నాడు..!

టీ20 సిరీస్‌కు సీనియర్‌ వికెట్‌ కీపర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిని దూరం పెట్టడాన్ని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సమర్థించాడు. ధోనిని దూరం పెట్టడం తనకేం ఆశ్చర్యం అనిపించలేదని, అతన్ని తప్పించడంలో తప్పులేదని అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడిన సౌరవ్‌ గత చాలా కాలంగా ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదన్నాడు. ధోని 2020 టీ20 వరల్డ్‌కప్‌ వరకు జట్టులో ఉంటాడని అనుకోవట్లేదని అందుకే సెలక్టర్లు రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇస్తున్నారని అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ వరకు సెలక్టర్లు ధోనికి అవకామిస్తేనే ఎక్కువగా భావిస్తానన్నాడు.  ధోని రంజీ ట్రోఫీలు ఆడాలని, తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఉపయోగపడుతుందన్నారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్‌లకు ధోనిని పక్కకు పెడుతూ సెలక్షన్‌ కమిటీ  భారత జట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad