శబరిమల అంశంపై స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

శబరిమల అంశంపై స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు!


శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతినిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కామెంట్‌ చేయాలనుకోవడం లేదంటూనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడిని ప్రార్థించే హక్కు అందరికీ ఉంటుంది కానీ కానీ హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. శబరిమల ఆలయంలోకి వెళ్లడమనేది కేవలం వ్యక్తిగతంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. రుతుస్రావ సమయంలో వాడిన సానిటరీ న్యాప్‌కిన్లను స్నేహితుల ఇంటికి కూడా తీసుకెళ్లనప్పుడు మరి దేవుడు ఉండే చోటుకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా తన ఇరుముడిలో సానిటరీ న్యాప్‌కిన్లను తీసుకువెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad