రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలి

బాణాసంచా విక్రయాల తయారీ, విక్రయాలను నిషేధించలేమని సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లైసెన్స్‌ కలిగిన వ్యాపారులే బాణాసంచా విక్రయించాలని, ఆన్‌లైన్‌లో విక్రయాలు జరపరాదని పేర్కొంది. రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలని సూచించింది. పర్యావరణానికి హానికలిగించని క్రాకర్స్‌ను కాల్చాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా కాలుష్యం విపరీతంగా పెరగడంతో బాణాసంచా పేలుళ్లతో ఇవి తీవ్రమవుతున్నాయని, ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad