చందమామకు సూపర్‌ ఛాన్స్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

చందమామకు సూపర్‌ ఛాన్స్‌

చందమామ కాజల్‌ తమిళంలో సూపర్‌ చాన్స్‌ దక్కించుకుందట. లోక నాయకుడు కమల్‌ హాసన్‌ సరసన నటించే అవకాశం వచ్చిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడుకు స్వీక్వెల్‌లో నటించేందుకు కాజల్‌ ఓకే చెప్పిందట. తెలుగులో అందరు స్టార్‌ హీరోలతో పనిచేసిన కాజల్‌ కమల్‌ సరసన అవకాశం రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసిందట. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌ కావడంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad