నన్నుదోచుకుందువటేపై ఆ ఇద్దరు దర్శకుల ప్రశంసలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

నన్నుదోచుకుందువటేపై ఆ ఇద్దరు దర్శకుల ప్రశంసలు


ప్రముఖ నటుడు సుధీర్ బాబు, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నన్నుదోచుకుందువటే మూవీ పాజిటివ్ రివ్యూలు దక్కించుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటరటైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం బాగుందని ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రముఖ రచయిత, నటుడు అడవి శేష్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చాలా బాగుందని సుధీర్ బాబు తన తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ సినిమాలో హాస్య సన్నివేశాలు అలరించాయని, ముఖ్యంగా సిరి పాత్ర అమాయకత్వం, హాస్య చతురత తనను ఆకట్టుకున్నాయని అడవి శేష్ ట్వీట్ చేశాడు. హీరో సుధీర్ బాబు, హీరోయిన్ నభా నటేశ్ ల మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అయ్యిందని తెలిపాడు. అదేవిధంగా ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఈ సినిమా చాలా బాగుందని ట్వీట్ చేశాడు. చిత్ర బృందం అందరూ అద్భుతంగా పనిచేశారని కొనియాడాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad