కోదండరాంను చూసి టీఆర్ఎస్ భయపడుతుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

కోదండరాంను చూసి టీఆర్ఎస్ భయపడుతుందా?


తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ అధినేత కోదండరామ్ ను చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని టీఆర్ఎస్ అంచనాలు వేసుకుంది. కాంగ్రెస్, టీడీపీ ఒక కూటమిగా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక కూటమిగా, కోదండరామ్ నేతృత్వంలోని టీజేఎస్ విడిగా, బీజేపీ, ఇతర చిన్నాచితక పార్టీలు వేటికవి పోటీ చేస్తాయని టీఆర్ఎస్ భావించింది. ఇన్ని పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని తాము సులువుగా విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ఆశించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధానంగా టీజేఎస్, కాంగ్రెస్-టీడీపీ కూటమి మధ్య చీలిపోతే భారీ మెజారిటీతో తాము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టీఆర్ఎస్ భావించింది. ఎప్పుడయితే టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ మహాకూటమిగా ఏర్పడ్డాయో ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ గొంతులో పచ్చివెలక్కాయపడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం మాత్రం అటుంచి గంపగుత్తగా మహాకూటమికే పడే అవకాశం ఉంది. దీంతో సులువు అవుతుందనుకున్న విజయం కాస్త కష్టంగా మారింది. దీంతో కోదండరామ్ ను లక్ష్యంగా చేసుకుని భావి ముఖ్యమంత్రిగా కితాబులందుకుంటున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ విమర్శలు సంధిస్తున్నారు. మూడు సీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ తో కలసి వెళ్తున్నారని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad