జర్నలిస్టు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

జర్నలిస్టు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి


సినీ నటిపై మరో లైంగిక వేధింపుల వ్యవహారం తెరమీదకొచ్చింది. ప్రముఖ తమిళ నటి గాయిత్రి సాయి (42) తనను ఒక సీనియర్ జర్నలిస్టు గత రెండేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియా అప్ లోడ్ చేసింది. సీనియర్ జర్నలిస్టు అయిన ప్రకాశ్ ఎం స్వామి తనను లైంగికంగా వేధిస్తూ వాట్సాప్ కు అసభ్య సందేశాలు పంపడం, చిత్రాలు పంపడం చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కమ్యూనిస్టు సర్వీస్ రిజిస్టర్ (సీఎస్ఆర్)లో నమోదు చేయడం వివాదాస్పదమైంది. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించినట్టు గాయిత్రి సాయి తెలిపారు. హాంగ్ కాంగ్ లో తన భర్త చనిపోయాక తన కుమారుడి పాస్ పోర్ట్ విషయంలో సహాయం చేస్తానంటూ ఆ జర్నలిస్టు తనను వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. అంతేకాకుండా తన భర్త గుండెపోటుతో మరణించడం వెనుక తన పాత్ర ఉందంటూ స్థానిక మ్యాగజైన్ లో తనపైన ఆధారరహిత కథనం కూడా రాశాడని వెల్లడించింది. ఒకసారి నేరుగా ఇంటికొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను జర్నలిస్టు స్వామి ఖండించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad