తెలుగులో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'ఝమ్మంది నాదం' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది.. కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ పన్ను. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ మిస్టర్ ఫర్పెక్ట్, సాహసం, కాంచన-2, ఘాజీ, ఆనందో బ్రహ్మ తదితర చిత్రాలు అమ్మడికి మంచి విజయాలను సాధించిపెట్టాయి. అయితే విజయాల కంటే పరాజయాలే శాతమే ఎక్కువ ఉండటం, ఒక్క ప్రభాస్ తో మినహాయించి అగ్ర హీరోలతో చిత్రాలేవీ లేకపోవడంతో అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పింక్, సూర్మా, ముల్క్ తదితర చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ తో కలిసి తాప్సీ నటించిన 'మన్మర్జియాన్' సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు దక్కించుకుంది. ఈ భామ ప్రస్తుతం నాలుగు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ బిజీబీజీగా ఉంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఫెమినా ఇండియా.. తన మ్యాగజైన్ కవర్ పేజీపై తాప్సీ ఫొటోను ముద్రించింది. ఫెమినా ఇండియా అక్టోబర్ సంచిక కోసం లాంగ్ గౌన్ లో, బ్రౌన్ కలర్ హెయిర్ స్టైల్ తో తాప్సీ ఇచ్చిన పోజు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

No comments:
Post a Comment