బాలాపూర్ ల‌డ్డూ ధర.. రూ.16.60 ల‌క్ష‌లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 23, 2018

బాలాపూర్ ల‌డ్డూ ధర.. రూ.16.60 ల‌క్ష‌లు


భాగ్యనగరం.. హైదరాబాద్.. 'బోలో గణేశ్ మహరాజ్ కు జై' నినాదాలతో మార్మోగుతోంది. భారీ స్థాయిలో ఈ రోజు 40,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మొత్తం నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుల విగ్రహాలతో కళకళలాడుతోంది. మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరనున్నాడు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 వేల మంది పోలీసులను కేటాయించారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను మళ్లించారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలంతా రోడ్లపైనే ఉండే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట పూర్తయింది. రూ.16 లక్షల 60 వేలకు శ్రీనివాస్ గుప్తా (ఆర్యవైశ్య సంఘం) దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్ష రూపాయలు ధర అదనంగా పలికింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad