Video Of Day

Breaking News

ఫెమినా వెడ్డింగ్‌ టైమ్స్‌ కవర్‌పేజ్‌పై అదరగొట్టిన మిల్కీ బ్యూటీ


మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం హిందీ సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘క్వీన్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదేకాకుండా విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌)’ చిత్రంలోనూ, మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’లోనూ నటిస్తోంది. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలోనూ తమన్నానే హీరోయిన్‌ అని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. టాలీవుడ్‌లోనే కాకుండా శాండల్‌వుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ ఆమె చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. కాగా, ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫెమినా వెడ్డింగ్‌ టైమ్స్‌ కవర్‌పేజ్‌ కోసం ఇచ్చిన లుక్‌ ఆమె అభిమానులను ఒక రేంజులో ఆకట్టుకుంటోంది. తన నాభి అందాలను యథేచ్చగా ప్రదర్శిస్తూ ఆమె ఇచ్చిన పోజు కుర్రకారు గుండెలను లయతప్పేలా చేస్తోంది. ఎర్రటి చీరను తన ఎడమ చేతి మీదుగా స్టైల్‌గా కిందకు వదిలేసి ఈ భామ ఇస్తున్న లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

No comments